• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

Teachers
తాళపత్ర గ్రంథం

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
గుడిలో దర్శనం అయ్యాక ఎందుకు కూర్చోవాలి ?

గుడి ప్రశాంతతకు మారు పేరు . దేవుడ్ని దర్శించగానే మనలోని కోపమూ , అహమూ , ఆవేశమూ , స్వార్ధ చింతన ఆ కొంతసేపు దూరమవుతాయి . వెనువెంటనే జనారణ్యంలోకి వెళితే మళ్ళీ మన మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది . అది ఎలాగూ తప్పదు . కాబట్టి , దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైన మనసుతో కూర్చుంటే , ఆ దేవాలయాల్లో చేసిన యజ్ఞ , యాగాది , పుణ్యపూజల ఫలం వల్ల మనసు మాలిన్యం కరగటం ప్రారంభిస్తుంది . అలా కొంతయినా ఆరోగ్యకరమైన , ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతాము

స్త్రీలు ధరించే నగల అర్థం ఏమిటి ?

వడ్రాణము : గర్భకోశము కదలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది . అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది . అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది .
ముక్కర : దీన్ని ధరించటం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలయినంత తక్కువ మాట్లాడమని చెబుతుంది . ముక్కర ధరించటం వల్ల ముక్కుకొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది .

ముగ్గుని ఎలా వేసుకోవాలి ?

ఉదయం పూట వీధిలో నుంచి మీ ఇంటిలోకి , సాయంత్రం పూట ఇంట్లో నుంచి వీధిలోకి ముగ్గు లెయ్యాలి . కళ్ళాపి చల్లి ముగ్గు వెయ్యటం లక్ష్మీప్రదం . శుభశకునములు.

శుభశకునములు?

నెరజాణా , శవమూ , చేపలూ , అగ్ని , సూద్రుడూ , మాంసమూ , నలుగురు వైశ్యులూ , ఇద్దరు మతైదువులూ , ఈ శకునాలన్నీ శుభములే . బిందెతో నీరు తెస్తున్న స్త్రీ , ఇద్దరు బ్రాహ్మణులు , స్త్రీ , కోడి , పాలపిట్ట ఇవన్నీ ఎడమవైపు నుంచి వస్తే మంచిది . మూడు అపశకునములు ఒక శుభశకునము .

ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి ?

వింటి నుంచి వెలువడ్డ బాణంలా , వెనుకెవరో తరుముతున్నట్టు ప్రదక్షిణం చేయరాదు . నిండు గర్భిణీ నడిచినట్టు అడుగులో అడుగు వేస్తూ అడుగడుగునా దేవుడ్ని స్మరిస్తూ ప్రదక్షిణములు పూర్తి చేయాలి . అలాగే అర్థరాత్రీ , మధ్యాహ్నమూ దైవదర్శనము చేయరాదు .

ఈశాన్యాన దేవుడ్ని పెట్టే వీలు లేకపోతే ?

మారిన జీవన పరిణామాల దృష్ట్యా , ఉద్యోగ - నిర్వహణల వల్ల ఎక్కడెక్కడికో వెళ్ళవల్సి వస్తుంది . అలాంటప్పుడు దేవుడ్ని ఈశాన్యాన పెట్టుకునే అవకాశం , సదుపాయము ఉండకపోవచ్చు . అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి .

ఆయుష్షును హరించే ఆరు దుష్టగుణాలు ఏమిటి ?

అహంకారము ... నలుగురితో గొడవలు .... వివాదాలు ... పిల్లికి బిచ్చం పెట్టకపోవటము , కోప మనస్తత్వము , నమ్మిన తన వాడ్నే మోసం చేసి తన పబ్బం గడుపుకునే మిత్రద్రోహి తత్వము . వీటి వల్ల మనిషి దీర్ఘాయువు తెలియకుండానే తగ్గిపోతుంది .

ఎడమ చేతి వేలుకే ఉంగరాన్ని ఎందుకు పెట్టుకోవాలి ?

ఎడమ చేతివేలికి మెదడులోని రక్తనాళాలకు అవినాభావ సంబంధము ఉంది . ఎడమ వేలికి ధరించటం వల్ల మొదడు చైతన్యవంతమై ఉత్సాహంగా మనల్ని నడిపిస్తుంది . నవరత్నాలు గల ఉంగరాన్ని ధరించటం ద్వారా సూర్యునిలో శక్తి గ్రహించి శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది .

స్నానం ఎంత సేపు చెయ్యాలి ?

కనీసం అరగంటయినా స్నానం చేస్తే మంచిది నాలుగు చెంబులతో శరీరాన్ని బాగా తడిపి , సున్నిపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకుని , ఆపై ఏడెనిమిది చెంబులతో శుభ్రపరుచుకోవాలి . చక్కటి మెత్తటి టవల్ లో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి . స్నానానంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవటం వల్ల అనేక రోగాలు వస్తాయి .

ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేము ?

తించిన కాలము , విల్లు నుంచి వెలవద్ద . బాణమూ , పెదవి దాటిన మాటా , చేజారిన అవకాశమూ తిరిగి రావు , పొందలేము . కాన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి . మాట్లాడే మాట ఆచి తూచి మాట్లాడితే అనర్ధాలు జరగవు . అవకాశం అరుదుగా వస్తుంది . అప్పుడే తలుపు తీయాలి ... సద్వినియోగ పరచుకోవాలి .
ఆ తర్వాత తలుపుతీసినా లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు .
మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు . దాన్నే అంటారు . చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని

శుభకార్యాలకీ , చర్చలకీ ముగ్గురెందుకు వెళ్ళ కూడదంటారు ?

సహజంగా ఈ విషయాన్ని మనం చాలాసార్లు విని ఉంటాము . ఏదన్నా పనిమీద వెళ్తున్నప్పుడు ముగ్గురు వెళ్ళకూడదంటారు . ఓ శుభకార్యం కోసమో , మరోకార్యం కోసమో ముగ్గురు వెళితే మార్గ మధ్యలో మాటల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు . వకరితో వకరు మాది సరయినదంటే మాది సరి అని వాదనకు దిగవచ్చు . అప్పుడు కార్యం వడలి గొడవకి దిగుతారు . అదే ఇద్దరయితే వొకరికొకరు సర్ది చెప్పుకుంటూ సరి చేసుకుంటూ వెళ్ళి కార్యాన్ని శుభప్రదంగా చేసుకుని వస్తారు .

చిన్నవారయినా పెద్దవారంటే ?

జ్ఞానమున్న బ్రాహ్మణులూ , బలమున్న రాజులూ , ధనమున్న వైశ్యులూ వీరంతా చిన్నవారయినా పెద్దవారే . పెద్దవారికిచ్చే అన్నీ గౌరవాలు ఇవ్వాలి . అలాగే వయస్సు వల్ల పెద్దవారయిన వారూ పెద్దవారే .

ఏ స్త్రీ ఎన్ని వరాలు కోరుకోవాలి ?

బ్రాహ్మణ స్త్రీ మూడు వరాలూ , క్షత్రియ స్త్రీ రెండు వరాలూ , వైశ్య స్త్రీ రెండు వరాలూ , శూద్ర స్త్రీ మూడు వరాలు అడగాలి . మహాభారత గాథలో ద్రౌపది ధృతరాష్ట్రుడ్ని రెండు వరాలే అడుగుతుంది . మూడో వరం కోరుకోమన్నా కోరుకోదు . ధృతరాష్ట్రుడే ద్రౌపది ధర్మ నియమాలకి మెచ్చి మూడో వరం ఇస్తాడు .

తిరుమల పాపనాశనమందు స్నానం చేస్తే ?

తెలిసి చేసిన , తెలియక చేసిన సమస్త పాపములు పశ్చత్తాపముతో మూడు రోజులు స్నానమాచరించిన సమస్త దోషాలూ పాపాలూ పోతాయని శ్రీవేంకటేశ్వర మహత్మ్యంలో ఉంది . చిత్తా నక్షత్రాన చైత్ర పౌర్ణమి ఉదయం ఆకాశ గంగలో స్నానమాచరించిన , నీటితో కడిగిన మురికిలా పాపాలు పోతాయి .

శివాలయంలో నందీశ్వరుని తోకను నిమిరేదెందుకు ?

శివాలయంలో నంది ఎద్దు జాతికి చెందినది కాదు . అయినా తోక నిమిరితే ఎంతో ఆనందము . అలా నిమిరినప్పుడు నందీశ్వరుడు పరమానందభరితుడై పరమేశ్వరునికి నీ భక్తుడు నీ దర్శనానికి వచ్చాడని నివేదిస్తాడు . ఎద్దు ధర్మానికీ , గుర్రం శక్తికి ప్రతీకలు . ధర్మానికి పురికొల్పుతున్నాం అని చెప్పటం కూడా తోక నిమరటంలో భాగం .

కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి ?

ఉల్లిపాయ , ఇంగువ , ముల్లంగి , ఆనపకాయ , మునగకాయ , వంకాయ , గుమ్మడికాయ , పుచ్చకాయ , వెలగపండు , చద్ది అన్నము , మినుములు , పెసలు , శెనగలు , ఉలవలు , కందులు ఇవన్నీ వాడరాదు . ఆష్టమి నాడు కొబ్బరీ , ఆదివారము ఉసిరీ తినరాదు .

హనుమంతునకూ , సువర్చలకు వివాహం జరిగిందా ?

కొన్ని ఆలయాల్లో ఏకంగా వారిద్దరికి వివాహం కూడా జరిపిస్తున్నారు . హనుమంతుడు బ్రహ్మచారి . సూర్యుని కుమార్తె పేరు సువర్చల . హనుమ సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు . ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది . విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలను వివాహమాడ మన్నాడు . హనుమ కలియుగాంతం అయ్యే వరకూ ఆగమన్నాడు . ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు . కాన సువర్చలను హనుమ ఈ కలియగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు . ఇచ్చిన మాట ప్రకారమూ , సూర్యుకిచ్చిన గురుదక్షిణ ప్రకారము .

శివాలయాల్లో ఎందుకు ప్రదక్షిణం చేయరాదు ?

మహేశ్వరుడు దేవాధిదేవుడు . అట్టి పరమేశ్వరునికి తలపై నుంచి గంగ జాలువారుతుంది . మహాశివుడ్ని అభిషేకించిన జలం ఆయన పీఠంపై జారి , ఏర్పరిచిన దారి నుంచి బయటికి ప్రవహిస్తుంది . ప్రదక్షిణం చేస్తే గంగను దాటినట్టే అవుతుంది . కాన శివాలయంలో ప్రదక్షిణ సరికాదని శాస్త్రాలు తెలుపుతున్నాయి .

గోవు సర్వదేవతామయమా ?

గోక్షీరమూ , దధి , ఘృత , మల మూత్రములు ఆవు నుంచి వచ్చే ఇవి పంచగవ్యములు . మూత్ర మందు వరుణదేవుడూ , గోమయమందు అగ్నిదేవుడూ , గో ఘృత మందు సూర్యభగవానుడూ , గోదధి యందు వాయుదేవుడూ , గో క్షీరమందు చంద్రుడూ ఉంటారు . అందుకే గోవు పూజింపదగ్గది . పవిత్రమైనది . సర్వదేవతాస్థానము .

గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడ్ని మూడు రూపాలతో చూడవచ్చా ?

గురువారం నాడు శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులకు మూడు రూపాలతో దర్శనము ఇస్తాడు . గురువారం ఉదయం రెండవ అర్చన అయిన తర్వాత శ్రీవేంకటే శ్వరుడు ఆభరణాలూ , అలంకరణలూ లేకుండా దర్శనమిస్తాడు . నొసటన సన్నని నామము మాత్రం ఉంటుంది . ఆ సమయంలో స్వామి వారి నేత్రాలని దర్శించి తరించవచ్చు . రాత్రి తోమాల సేవ అయిన తర్వాత పూలంగి సేవలో దర్శనమిస్తారు . అనగా గురువారం ఉదయం సకలాభరణముల తోనూ , రెండవ అర్చన తర్వాత అభరణాలు లేకుండా , రాత్రికి పుష్పాలంకరణతో దివ్య దర్శనాన్ని భక్తులకు అందిస్తారు . శ్రీవేంకటేశ్వర స్వామి .

నిద్రలేవగానే నీళ్ళెందుకు త్రాగాలి ?

పగలంతా అలసి సొలసి సాయంత్రం ఇల్లు చేరి సేదతీరి నిదురిస్తాము . ఆ తర్వాత మన శరీరంలో అవయవాలన్నీ మనతో పాటు విశ్రాంతి తీసు కుంటాయి . ఉదయం మనం అయితే లేస్తాము . కాని శరీరంలోని అవయవాలు ఇంకా మగతగానే ఉంటాయి . వాటిని ఉత్తేజ పరచాలంటే మన పదార్థంతో ప్రారంభించకూడదు . గోరువెచ్చని వేడి నీటితో మన దినచర్య ప్రారంభిస్తే శరీరంలోని అవయవాలు కూడా మనతో పాటే ఉత్సాహంగా పని చేస్తాయి . ఉదయం లేవగానే నీరు త్రాగటం వల్ల జీర్ణవ్యవస్థకి ఎంతో మేలు .

ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం ?

ఉదయాన్నే శ్రీమహావిష్ణువు ఆలయానికి , సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటము మంచిది . శ్రీమహా విష్ణువు స్థితి కారకుడు . కాన ఆయన మన జీవన పోరా టంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు . మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు . మహేశ్వరుడు లయకారకుడు . కాన రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అంది స్తాడు . తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగ వంతుడ్ని దర్శించాలి .

చనిపోయిన వార్ని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు ?

ఒరేయ్ పిచ్చోళ్ళారా ..... నేనెంతో ధనం సంపాదించాను , వక్క పైసా కూడా తీసుకెళ్ళటం లేదు . రేపు మీ ధనమయినా ఇంతే . కనుక ధర్మంగా , న్యాయంగా , జీవిస్తూ పదిమందికి సాయం చేసి పోవటమే అసలు మానవ ధర్మం . కాన మీరయినా స్వార్ధ చింతనలకు దూరంగా ఉండి , పదిమందికి మేలు చెయ్యండి అని .

స్త్రీకి వామనేత్రం అదిరితే ఎంతటి శుభం ?

స్త్రీకి వామనేత్రం అదిరినా , జలదరించినా శుభం . అలాగే ఎర్రటి కనుకొలనులు పులకించినా శుభనిమిత్తమే . సీతాన్వేషణ కొరకై హనుమ లంక చేరి అశోకవనం చేరిన సమయాన సీతాదేవిని దర్శించే కొన్ని క్షణాల ముందు సీతాదేవికి శుభసూచికంగా ఈ శుభనిమిత్తాలు కలిగాయి . ఆ క్షణం తర్వాత సీతాదేవికి అన్నీ శుభములే . సకల సౌభాగ్యాలతో భర్తతో ఆపై ఎంతో సుఖించింది సీతాదేవి . కష్టాల సమయంలో అలాంటి శుభనిమిత్తాలు కలిగితే అన్నీ కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది .

శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు ?

సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే . శ్రీకృష్ణునికి పదహారు వేలమంది గోపికలు . అన్ని వేల మంది భామలతో శ్రీకృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు . అల్లరి చేసి ఆడాడు . అంతవరకే మెలిగాడు . ఆ విషయాన్ని తెలియచేయటమే శ్రీకృష్ణుడి పైనున్న నెమలిపింఛం భావం . శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే . అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీ శ్వరుడు . వారందరితో పవిత్ర స్నేహ సన్నిహితంగా ఉన్నానని పదే పదే చెప్పటమే నెమలిని ధరించటము . నెమలి అంత పవిత్రమైనది కనుకే మన జాతీయ పక్షి అయింది .

తిరుమలలో పూలబావి ప్రత్యేకత ఏమిటి ?

అద్దాల మంటపానికి ఉత్తరం వైపున ఉంది . ఈ పూలబావి . స్వామివారికి సమర్పించిన తులసీ , పూలమాలలూ , పుష్పాలనూ ఎవ్వరికి ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు . ఆపద సంభవించనప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య మార్గం ద్వారానే శ్రీనివాసుడ్ని శరణు వేడాడు . స్వామి వారు ఆ సమయంలో ఏకాంతంగా ఉన్నారు . తొండమానుడ్ని చూసి శ్రీమహాలక్ష్మి సిగ్గుతో శ్రీమహావిష్ణువు వక్షస్థలంలో చేరితే , భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి దాక్కుందని వరాహ పురాణం చెబుతోంది .

ధైర్యం సుఖాలకు మూలమా ?

ఏం జరుగుతుందోనని అటూ , ఇటూ ఎన్నో విధాలుగా ఆలోచించి ఏ పనినీ కొందరు ప్రారంభిం చరు . అట్టి వారు అధములు . తొలుత అట్టహాసముతో ప్రారంభించి చిన్న ఆటంకానికే చతికిలపడి కార్యాన్ని మధ్యలో ఆపేవారు మధ్యములు . థైర్యాన్ని ప్రధానంగా ఎంచుకుని ముందుకు సాగిపోయే వాడు ఉత్తముడు .... వాడే ధైర్యవంతుడు . ' ధైర్యే సాహసే లక్ష్మి ' అని అందుకే అన్నారు .

దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకంటుకుంటుందా ?

ఖచ్చితంగా . ప్రొద్దున లేస్తే సమస్యలూ , బాధలూ , ఇంకా అనేకం . ఇవేగా దరిద్రానికి కారణము . ధనం లేని దరిద్రడితో స్నేహం చేస్తే ధనమునూ , విద్యాదరిద్రం కలవాడితో స్నేహం చేస్తే విద్యాజ్ఞానమూ , సంస్కారము లేని దరిద్రుడిలో స్నేహం చేస్తే సంస్కారమూ తరిగి పోతాయి . అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన , వారితో స్నేహం చెయ్యాలంటారు .

పురుషుడు చెయ్యకూడనివి ?

* భార్యను హక్కుగా భావించి తిట్టరాదు . ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు , దువ్వరాదు .
* భార్య వడ్డించిన పదార్థాలను విమర్శించరాదు .
* ఇంటిని భార్య జైలులా భావించే పరిస్థితులు లేకుండా వారానికి ఒక్కసారయినా బైటికి తీసుకెళ్ళాలి .
* పిల్లలతో సరళ సంభాషణలు చేయాలి .
* పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు .
* ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి .
* భార్యకి ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి .
* ఆమె అభిప్రాయాలను గౌరవించాలి .

భార్య , భర్తకు ఏ వైపుగా ఉండాలి ?

సమస్త కార్యాల్లోనూ ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పటం లేదు .
పూజాదికాలు నిర్వహించేటప్పుడూ , దానాలూ , ధర్మాలు చేసే సమయాన భార్య భర్త ఎదమవైపున ఉండాలి .
కన్యాదాన సమయాన , విగ్రహ ప్రతిష్ఠలప్పుడూ కుడివైపున ఉండాలి .
బ్రహ్మదేవుడు మగవాడ్ని కుడిభాగం నుంచి , స్త్రీని ఎడమభాగం నుంచీ సృష్టించాడని శాస్త్రాలు చెబుతున్నాయి .
శ్రీమహావిష్ణువు తన భార్య శ్రీమహాలక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకున్నాడు .

పూజలో కొబ్బరి కాయ కుళ్ళితే మంచిదా ?

పూజలో కొట్టిన కాయ కుళ్ళితే దోషమేమి కాదు . తెలిసి చేసిన కాదు . దేవాలయాల్లో కొట్టే కాయ కుళ్ళితే వెంటనే నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్ఛాటన చేసి మళ్ళీ స్వామిని అలంకరిస్తారు . అనగా కుళ్ళిన కాయ దోషమేకాని ఇచ్చిన వ్యక్తికి సంబంధించినది కాదు . ఇంట్లో పూజ చేసేటప్పుడు కుళ్ళితే తీసేసి కాళ్ళూ , చేతులూ , ముఖమూ , పూజా మందిరాన్ని శుభ్రం చేసి , మళ్ళీ పూజ చేయటం మంచిది . అదే వాహనాలకి కొట్టే కాయ కుళ్ళితే , అంత దిడ్డీ పోయినట్టే . అయినా మళ్ళీ వాహనం కడిగి .. మళ్ళీ కాయ కొట్టాల్సిందే . మనసులో అనుమానం ఉంచుకునేకంటే , మళ్ళీ చెయ్యటం మంచిది .

ఎవరి పాపాలు ఎవరికంటుతాయి ?

ప్రజలు చేసిన పాపాలు రాజుకూ , రాజు చేసే పాపాలు పురోహితులకూ , భార్య చేసిన పాపాలు భర్తకూ , శిష్యుడు చేసిన పాపము గురువుకు సంక్రమిస్తాయి . మగపిల్లాడు తప్పు చేస్తే తల్లీ , ఆడపిల్ల తప్పు చేస్తే తండ్రి బాధ్యుడు .

ధనమేరా అన్నిటికీ మూలం ?

ధనం సంపాదించకుంటే తల్లి నిందిస్తుంది . తండ్రి సంతోషించడు . అన్నదమ్ములు మాట్లాడరు . పనివాడు కోపిస్తాడు . భార్య రాత్రి పూట కూడా దూరంగా ఉంచు తుంది . మిత్రుడు ఎదురైనా పలకరించడు . కాన విధిగా మానవుడు ధనాన్ని సంపాదించాలి . కూడబెట్టాలి .

పరిపూర్ణ ఆరోగ్యంగా జీవించాలంటే ?

మధ్యాహ్నము ఎందనూ , శవాన్ని కాల్చినప్పుడు వచ్చే పొగనూ , వృద్ధ స్త్రీనీ , తనకన్నా వయసులో పెద్దదైన స్క్రీనీ , గట్టి పెరుగునూ , చీపురు ధూళినీ సేవించ కూదదు . సేవించినచో ఆయుషు తగ్గును .

వీటినెన్నటికీ చెప్పరాదు ?

నేర్చుకున్న రహస్య మంత్ర ఔషధములూ , ధర్మమూ ( చేసి చూపించాలి ) , ఇంటిలో పోరూ , కోరి వచ్చిన లేదా కోరుకున్న స్త్రీతో కలయికా , భార్యతో గడిపిన విషయాలూ , చెడువార్త ... ఇట్టి వీటిని ఇతరులతో చెప్పరాదు .

ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేము ?

గతించిన కాలము , విల్లు నుంచి వెలవడ్డ బాణమూ , పెదవి దాటిన మాటా , చేజారిన అవకాశమూ తిరిగి రావు , పొందలేము . కాన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి . మాట్లాడే మాట ఆచి తూచి మాట్లాడితే అనర్ధాలు జరగవు . అవకాశం అరుదుగా వస్తుంది . అప్పుడే తలుపు తీయాలి ... సద్వినియోగ పరచుకోవాలి . ఆ తర్వాత తలుపుతీసినా లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు . మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు . దాన్నే అంటారు . చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని

గోళ్ళను ఇంట్లో ఎందుకు తీయకూడదు ?

మానవ శరీరంలోని చేతి , కాలి వేళ్ళకున్న గోళ్ళు విషపూరితమైనవి . మనం భోజనం చేసేటప్పుడు పొరపాటున గోళ్ళ ముక్కలు అన్నం ద్వారా తీసుకుంటే , అవి జీర్ణం కావు . మన జీర్ణవ్యవస్థకి అంత శక్తి లేదు . విసర్జించేటప్పుడు ప్రేగులకి ఇత్యాది వాటికి తగిలితే ప్రమాదం . అందుకే గోళ్ళు ఇంట్లో తియ్యకపోవటమే కాదు . విధిగా వారానికోసారి కత్తిరించుకోవాలి .

అతిగా తింటే నిద్ర ఎందుకు ముంచుకు వస్తుంది ?

తినగానే నిద్ర మంచిది కాదు . పూర్వకాలంలోని వారు భోజనం చేశాక కాస్త దూరం నడిచేవారు . సత్రాల్లో భోజనం చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోయేవారు కాదు . తమ తమ ధనాన్ని దొంగలూ , స్వార్థపరులూ కొల్లగొట్టే ప్రమాదం ఉందని . ఆ కారణంగానూ , ఆరోగ్య పరంగానూ నిద్ర మంచిది కాదు . భోజనం చేసినపుడు జీర్ణవ్యవస్థలో రక్తప్రసారం జరిగి పోషకాలను స్వీకరిస్తుంది . ఆ సమయంలో ఎక్కువ రక్తం అవసరం అవ్వటంతో శరీరంలోని మిగతా భాగాల్లో రక్తప్రసరణ తగ్గి మగతగా మత్తుగా అనిపిస్తుంది . నలభై అయిదు దాటిన వారు భోజనం అయ్యాక ఓ పావు గంట ఆగి నిదురించటం మంచిది .

రంగులూ , వారాలకి ఎంతో సంబంధముంది ?

ఎరుపు ఉత్తేజకారిణి , నారింజ దేహంలోని శక్తిని కదల్చగలదు . పసుపు ఆధ్యాత్మిక జ్యోతి . ఇక ఆకుపచ్చ ఆందోళననూ , నీలిరంగు భౌతిక సౌఖ్యాన్ని , గులాబి రంగు ప్రేమనూ , ఆప్యాయతనూ , బూడిదరంగు సంతృప్తినీ , వంకాయ రంగు కామాన్ని వృద్ధి చేస్తుంది . అలాగే ఏ వారం ఏ రంగు తగినదంటే ... ఆదివారం నారింజా , సోమవారం తెలుపూ , మంగళవారము ఎరుపూ , బుధవారము ఆకుపచ్చా , గురువారం పసుపూ , శుక్రవారం బూడిదా లేదా వంకాయ రంగూ , శనివారం నలుపూ అంటే ఆయా గ్రహాలకు ప్రీతి .

గోళ్ళెందుకు కొరకకూడదు ?

అట్టి చర్యలు రాక్షసగుణాన్ని ప్రేరేపిస్తాయి . దానికి , తోడు గోళ్ళలోని మట్టీ , క్రిములూ హాయిగా మనలో ప్రవేశించి మనలో అశాంతిని కలిగిస్తాయి . ధర్మశాస్త్రాలు గోళ్ళు కొరుక్కోవటం అనే అలవాటు మిక్కిలి దరిద్రహేతువని శెలవిస్తున్నాయి .

ఎట్టి గ్రంథాలు చదవరాదు ?

కామాన్నీ , క్రోథాన్నీ , మోహాన్ని పెంచే పుస్తకాలు చదవటం వల్ల సమస్త అనర్ధాలను తెచ్చుకున్నట్టే . శృంగార కావ్యాలు చదవటం వల్ల మర్యాదా , సిగ్గు వదిలి స్త్రీ సాంగత్యము కోసం చెయ్యరాని పనులు చేయాల్సి వస్తుంది . అలాంటి ప్రవర్తన ద్వారా వచ్చేది అవమానమూ , తలవంపులే . దానితో మనిషి ప్రవర్తన మారి నేరస్థు డవుతాడు . క్రోథ , మదాల సాహిత్యం చదవటం వల్ల మిత్రులు శత్రులవుతారు . అయిన వారు దూరమవుతారు . మంచి విషయాలు మాట్లాడుకుంటే మనసు మంచిగా ఉంటుంది . మంచిగా ఆలోచిస్తుంది . మంచే జరుగుతుంది .

ఏకలవస్తే ఏ వ్యాధి రావటానికి అవకాశం ఉంది ?

భూత ప్రేత పిశాచులు వస్తే జ్వరం రావటానికీ , ఎర్రని పూలదండలూ , వస్త్రాలలో స్త్రీ పురుషుల కానవస్తే రక్త సంబంధిత రోగాలూ , దున్నపోతూ , కుక్క గాడిదా , ఇట్టి వాటినెక్కి దక్షిణ దిక్కుగా వెళుతున్నట్లు కలవస్తే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులూ , రాక్షసులతోనూ , నీటితోనూ ఈ రెంటితో సంబంధము వంటి కలలొస్తే పిచ్చిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులూ వస్తాయి . చంద్ర సూర్య గ్రహణాలు వచ్చినట్టు కలవస్తే కంటి వ్యాధులు వస్తాయి . నల్లనిది , భయంకర ముఖాలు కలిగిన వారు కలలోకి వస్తే ఎంతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక . అనేక వంకరలు కలిగిన వారితో నూనె త్రాగినట్టు కలవస్తే తీపి వ్యాధి వస్తుందని సూచన . ఈ కలల రూపానికీ , వాస్తవానికి మన జీవన ప్రవర్తనే కారణము . వచ్చే కలలన్నీ మన ఊహల్లో ఉన్నవే అని అర్థం చేసుకోవాలి .

మానవతా విలువలంటే ?

* కళ్ళ ముందు అధర్మం జరుగుతుంటే ఆపటం .
* స్నేహం పేరుతో మోసం చెయ్యకుండా ఉండటం .
* పరస్త్రీని కామంతో చూడకుండా ఉండటం .
* సాటి మనిషికి సహాయపడటం .
* కష్టాల్లో అయిన వారికీ , నమ్ముకున్న వారికీ అండగా ఉండటం .
* సమాజాన్ని ప్రేమించటం .
* భర్తగా , భార్యగా , తల్లిగా , తండ్రిగా , అక్కగా , చెల్లిగా , అన్నగా , పౌరునిగా , పౌరురాలిగా తమ ధర్మాలను నిర్వర్తించటము .

ఎవరికి ఎంత నిద్రా సమయం కావాలి ?

ఎవ్వరికైనా ఎనిమిది గంటలు నిద్ర తప్పని సరి . పసి పిల్లలుకు పన్నెండు నుంచి పధ్నాలుగు గంటలు . వృద్ధులకు పదిగంటలు . గర్భిణీ స్త్రీలకూ , పాలిచ్చే తల్లులకూ వీలయినంత ఎక్కువ నిద్ర అవసరం . నిద్ర ఆయుషునీ , శక్తిని పెంచుతుంది . పగటి నిద్ర కేవలం ఎండాకాలంలోనే చేయాలి . రాత్రి తగ్గిన నిద్రలో సొగభాగమే పగలు నిద్రపోవాలి . యాభై దాటినవారు మధ్యాహ్నం నిద్ర ఓ అరగంట చేస్తే చాలా మంచిది .

దేవాలయాల్లో శృంగార బొమ్మలెందుకు ?

దేవాలయ వ్యవస్థ యందు సకల శాస్త్ర పరిజ్ఞానం వాడతారు . శృంగారం 64 కళల్లో ఒకటి . దృష్టి , దోష , నివృత్తి కొరకు దేవాలయ దక్షిణ భాగంలో శృంగార భంగిమలను ఉంచుతారు .

నవరత్న ఉంగరాన్ని ఏ విధంగా చేయించుకోవాలి ?

నవరత్న ఉంగరం మధ్యలో కెంపునూ , తూర్పుదిశగా వజ్రాన్నీ , ఆగ్నేయ దిశగా ముత్యాన్నీ , ఈశాన్యమున పచ్చనూ , దక్షిణాన పగడాన్నీ , నైఋతిన గోమేధికమూ , పడమర నీలాన్నీ , వాయువ్యమున వైఢూర్యాన్నీ , ఉత్తరాన కనకపుష్య రాగాన్ని పెట్టి చేయించుకోవాలి .

ఉపవాస కాలము ఉపవాసమంటే

ఏమీ తీసుకోకపోవటము . ఆఖరికి ఉమ్మి కూడా మింగకపోవటము . ఉపవాసమంటే , భగవంతుడ్ని సదా స్మరిస్తూ , ఆయన ధ్యాసలోనే ఉండాల్సిన సమయం . ఉపవాసం వల్ల శరీరంలో మలినాలెన్నో పోతాయి . ఉపవాసమంటే భగవంతుడితో పాటు , మన శరీరాన్ని పూజించటము . పురాణశాస్త్రాల్లో పొరపాట్లు చేసిన వారు ఉపవాసాలు చెయ్యాలని ఉంది . అలాగే ఉపవాసాలు బంధువులు , స్నేహితులూ వంటి వారు రాని రోజుల్లో చేయాలి .

స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు ?

భగవంతునికి సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు . తమ ఎనిమిది అంగాలనూ అనగా వక్షస్థలమూ , నుదురూ , రెండు చేతులూ , రెండు కాళ్ళూ , రెండు కనులూ భూమిపై ఆన్చి నమస్కరించవచ్చు . కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారము చెయ్యాలను కున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది . ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది . ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది . అందుకే ఇతిహాసాల్లో ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని చెప్పారు . ఇంకా చెయ్యగలిగితే నడుం వంచి ప్రార్ధించవచ్చు .

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
Course
6000Rs
(2000 Reviews)

Java Learning

Course
6000Rs
(2340 Reviews)

Python Learning

Course
6000Rs
(2000 Reviews)

.NET Learning