• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

Teachers
తాళపత్ర గ్రంథం

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి ?

పరమేశ్వరుని పూజలకు జిల్లేడూ , గన్నెరూ , మారేడూ , తమ్మి , ఉత్తరేణు ఆకులూ , జమ్మి ఆకులూ , జమ్మి పూలూ , నల్లకలువలూ మంచివి . దాసాని , మంకెన , నదంతి , మొగలి , మాలతి , కుంకుమ మద్ది ... ఈ పూలు పూజకు పనికి రావు . తొడిమలేని పువ్వులు పూజకు పనికిరావు . తమ్మి పువ్వుకు పట్టింపులేదు . మారేడు నందు శ్రీమహాలక్ష్మీ , నల్లకలువ నందు పార్వతీ , తెల్ల కలువనందు కుమార స్వామీ , కమలము నందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు . అలాగే చదువుల తల్లి సరస్వతి దేవీ తెల్ల జిల్లేడులో , బ్రహ్మ కొండవాగులో , కరవీరపుష్పంలో గణపతి , శివమల్లిలో శ్రీమహావిష్ణువూ , సుగంధ పుష్పాల్లో గౌరీదేవీ ఉంటారు . అలాగే శ్రీమహావిష్ణువుని అక్షింతల తోనూ , మహాగణపతిని తులసితోనూ , తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవినీ , మల్లెపువ్వులతో భైరవుడ్నీ , తమ్మి పూలతో మహాలక్ష్మినీ , మొగలి పువ్వులతో శివుడ్నీ , మారేడు దళాలతో సూర్యభగవానుడ్ని ఎట్టి స్థితిలోనూ పూజింప రాదు .

శ్రీ లలితా సహస్రనామం ఏ పురాణంలో ఉంది ?

ఈ సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో ఉంది . హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ సహస్ర నామ స్తోత్రం తెలియ చేస్తాడు . విద్యా రూపిణీ , జగత్తును ధరించినదీ , సృష్టిస్థితి లయకారకురాలు అయిన మహా త్రిపుర సుందరి వైభవము శ్రీలలితా సహస్రనామము , వెనువెంటనే సిద్ధి కలిగించేది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము . ఇందు వెయ్యి నామాలు వెయ్యి మంత్రాలు . కుండలినీ , యోగరహస్యమూ , సుగుణోపాసనా , శ్రీచక్రవర్ణనా , చతుషష్టియోగినీ విషయాలు , లలితాంబిక తత్త్వమూ మొదలగు అనేక విషయాలు గల లలితా సహస్రనామ స్తోత్రం వశిన్యాది దేవతలు వ్యాస భగవానుని ద్వారా భూలోకానికి వ్యాప్తి చేశారు .

రోహిణికార్తెకి రోళ్ళు పగులుతాయా ?

రోహిణి కార్తెలో అనగా మే నెలలో సూర్య , భగవానుడు మన నడి నెత్తి మీదకొస్తాడు . అనగా మధ్యభాగానికి వస్తాడు . చండ్ర ప్రచండుడిగా మారతాడు . ఎండలు నిప్పులు కక్కుతూ భూమిని తాకుతాయి . దానితో భూమిలోని తేమ హరించుకుపోతుంది . రాళ్ళలో కూడా అంతో ఇంతో తేమ ఉంటుంది . తేమ శాతం ఇంకిపోగానే రోహిణిలో రోళ్లు కూడా పగులుతాయి .

ఉదయన్నే నీరు తాగటం ఎందుకు ?

ఉదయాన్నే లేవగానే పది ద్రోసిళ్ళ నీరు త్రాగటం మంచిది . ఎంతో యవ్వనవంతంగా ఉంటారు . పెద్దలకీ పిల్లలకీ ఉదయాన్నే నీళ్ళు త్రాగటం అలవాటు చేస్తే వారు జీవితాంతమూ అజీర్తి , మూత్రపిండాల వ్యాధు లతో బాధపడకుండా ఉంటారు . రాగి చెంబుతో నీరు త్రాగితే ఎలాంటి మలబద్ధకమూ ఉండదని ఆయుర్వేదం చెబుతోంది .

ఏ లక్షణములు గల సాలగ్రామములు మంచివి కావు ?

* వంకర టింకర కలది
* వంకర చక్రము
* పక్కమూతి
* విరిగిన చక్రము
* పగిలిన చక్రము
* ఎరుపు ముఖాలు గలవి
* తలక్రింద చక్రము
* లోపల పగులు కలది .
* మసక వన్నె
* లోపలనీరు నిలిచివున్నది
* ముక్కోణము కలది
* ఏ గుర్తు లేనిది
* వెచ్చగా వున్నది
* మిక్కిలి గీతలు కలది
* అస్పష్టమైనది
* వేడి గుణం లేనిది
* అనేక రంధ్రములు కలది

Course
6000Rs
(2000 Reviews)

Java Learning

Course
6000Rs
(2340 Reviews)

Python Learning

Course
6000Rs
(2000 Reviews)

.NET Learning