Opening Hours :7AM to 9PM
దేవాలయాల్లో రావి , వేప చెట్టు కలిసే ఉంటాయి . రావి చెట్టును శ్రీమహావిష్ణువుగానూ , వేప చెట్టును లక్ష్మీదేవిగానూ భావించాలని శాస్త్రాలు , వేదాలూ చెబుతున్నాయి . ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయటం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు . శని దోషం ఉన్న వారు రావి చెట్టుకు పూజ చేయాలి . నమస్కరించి , కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి . ఈ రావి చెట్టు క్రిందే బుద్ధుడికి జ్ఞానోదయ మైంది .
శ్రీకృష్ణుడు చివరిదశలో ఈ చెట్టు క్రిందే విశ్ర మించి వైకుంఠాన్ని చేరాడు . అలాగే వేప చెట్టు గాలికే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి . పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చి తంగా పెంచుతారు . వాటికవే ఉద్భవిస్తాయి కూడా . రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు . వేప చెట్టును ఇంటికి ముందూ వెనుకా నాటుకోవాలి . ఇంటి ముందు వేప చెట్టుంటే వైద్యుడున్నట్టే .
ఎంతో పురాతన కాలం నుంచి అనగా ... భారతం జరిగిన కాలం ముందు నుంచీ వాస్తు అమల్లో వుంది . రామాయణంలో అరణ్యవాస సమయంలో లక్ష్మణుడు పర్ణశాల నిర్మించగానే శ్రీరాముడు సీతాదేవితో కలిసి వాస్తు పూజ చేసి లక్ష్మణుడితో కలిసి గృహప్రవేశం చేశారు . విశ్వకర్మ , మయుడూ , వాస్తుశాస్త్ర నిపుణులే . ఆరోగ్యానికీ , ఆహ్లాదానికీ , ఆనందానికి అన్నింటికీ మూలమే వాస్తు . కము సుగ్రీవుని పట్టాభిషేకము అనంతరము సీతా న్వేషణకు సమయ నిరీక్షణ చేయాల్సిన సమయంలో శ్రీరామ లక్ష్మణులు వాస్తు చూసుకునే నివశించారు . రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు . వేప చెట్టును ఇంటికి ముందూ వెనుకా నాటుకోవాలి . ఇంటి ముందు వేప చెట్టుంటే వైద్యుడున్నట్టే .
శ్రీమహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడిచేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది . మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీమహావిష్ణువుపై ఉంచాడు . శ్రీవృక్షమనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షంను దేవతలు స్వర్గంలోనూ , మందర పర్వతం పైనా , వైకుంఠంలోనూ నాటారు . శివుని కిష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు . సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియో గించాలి . ఎండినా , కోసి రెండు మూడు రోజులైనా శివ పూజకు వాడకూడదు . బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి . సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది . బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పువ్వులతో సమానము .
* స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు .
* అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు .
* ఒకవత్తి దీపాన్ని చేయరాదు . ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు .
* దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి .
* దీపారాధన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి .
* విష్ణువుకు కుడివైపు ఉంచాలి . ఎదురుగా దీపాన్ని ఉంచరాదు .
* దీపం కొండెక్కితే 108 సార్లు “ ఓం నమ శ్శివాయ ' అని జపించి దీపం వెలిగించాలి .
ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి . మెడ వరకూ నీటిలో ఉండి స్నానం చెయ్యటం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి . కార్తీక స్నాన విషయంలో ఓ ఆరోగ్య సూత్రం ' కూడా ఉంది . వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బల మైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది . వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీకమాసంలో ప్రవ హించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది . దాని వల్లే కార్తీక మాసంలో నదీస్నానమూ , సముద్ర స్నానమూ చేయమంటారు . హరిహరాదులకు ప్రీతికర మైన మాసం కార్తీకమాసము . ఈ మాసములో నదీసముద్ర స్నానమూ , దీపా రాధన ఎంతో పవిత్రము . పురుగులూ , మిడతలూ , చెట్లూ , పక్షులూ ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యాన్ని పొందుతాయి .
కలియుగ వైకంఠమైన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వెలసి ఉన్న స్థానంలో బంగారు గోపురంపైన వెండి ద్వారంలో కొలువై శ్రీవేంకటేశ్వరస్వామి ఉంటారు . ( వెండి ద్వారం గోవురం పైనున్న స్వామి ప్రదేశాన్ని చూపేందుకు ) దర్శనం అయ్యాక చాలా మంది గోపురం పైన ఉన్న స్వామిని చూసి దర్శించి నమస్కరిస్తుంటారు . వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వేంకటేశ్వరస్వామి అని కూడా అంటారు . మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వేంకటేశ్వరుని తీసుకొచ్చాడు . ఆ దర్శనము పశుపక్షాదుల కోసము , దేవతల కోసము . ఆకాశాన్నించి ముక్కోటి దేవతలు దిగివచ్చి స్వామిని సేవించుకోవటం కోసమే . మన పగలూ , రాత్రితో వారికి సంబంధం లేదు గనుక వారి పూజా సమయం వేరు గనుక , భూమి క్రిందున్న , భూమిపైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది . - తిరుమల వెళ్ళిన వారు తప్పక విమాన వేంకటే శ్వరుడ్నీ , స్వామి పాదాలనూ దర్శించి తరించండి .
గృహంలో పూజ చేసిన తర్వాత కట్టుకునే తోరము లాంటివి నల్లదారాలు . దేవాలయాల వద్ద దీన్ని ధరిం చటం పుణ్యకార్యమే . కాశీ దారమూ , తోరమూ అని పిలిచే వీటిని ధరించటం ద్వారా ప్రయాణ దోషాలన్నీ పోతాయి . శుభప్రదంగా మళ్ళీ మన ఇంటికి చేరుస్తాయి . సర్వగ్రహాలకూ శాంతి మరియు దిష్టి కూడా వదులు తుంది . ప్రయాణ సమయాల్లోనూ , పుణ్య తీర్థాలలోనూ తెలియక అనేక తప్పులు చేస్తాం . వాటిని పొగొట్టేవే నల్లదారాలు .
ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఓ ముఖ్య పండగ . ఈ పండగనాడు అట్లు పోస్తారు . అలా పోసేటప్పుడు అట్లకు ఎన్ని చిల్లులు పడతాయో , అన్ని వేల సంవత్సరాలు తమకి అయిదో తనాన్ని ప్రసాదించమని గౌరీదేవిని వేడుకోవటమే అట్ల తద్ది . పెళ్ళి కాని వారు ఈ వల్ల సుందరమైన భర్త , చక్కటి పిల్లలు కలుగుతారు . గోరింటాకు రుబ్బుకుని పెట్టుకుంటేనే ఈ పండగ అసలు కళ . కాని వారు ఈ అట్ల తద్ది జరుపుకోవటం
గతించిన కాలము , విల్లు నుంచి వెలవడ్డ బాణమూ , పెదవి దాటిన మాటా , చేజారిన అవకాశమూ తిరిగి రావు , పొందలేము . కాన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి . మాట్లాడే మాట ఆచి తూచి మాట్లాడితే అనర్ధాలు జరగవు . అవకాశం అరుదుగా వస్తుంది . అప్పుడే తలుపు తీయాలి ... సద్వినియోగ పరచుకోవాలి . ' ఆ తర్వాత తలుపుతీసినా లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు . ఇటు మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు . దాన్నే అంటారు . చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని
భగవంతుని రూపమైన విగ్రహాలకి మంత్ర యంత్రాలతో ప్రతిష్ఠ జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి . సాక్షాత్తు దేవతా , దేవుడూ అంశ ఆ విగ్రహానికి వస్తుంది . నిత్య దీప ధూప నైవేద్యాలుంటాయి . శుచీ , ఆచారమూ , శుభ్రతలు అత్యవసరం . స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి . ఏ సమయంలో అలా జరుగుతుందో వారికే తెలీదు . అలాంటప్పుడు ఆ సమయాల్లో పూజాధికాలు నిర్వర్తించటం జరిగితే భగవత్ దోషమవుతుంది . మళ్ళీ అనేక శుద్ధి క్రియలు చేయాలి . అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవదర్శనమూ , పూజాధికాలు చేయరు . దాని వల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు . గుడిలో సహితం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు .
Java Training in Andhra Pradesh and Telangna