• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

Teachers
తాళపత్ర గ్రంథం

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
చంటి పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయించేదెందుకు ?

చిన్నపిల్లలకి స్నానం చేయించటమన్నది అతి పెద్దపని . అందుకనే పసిపిల్లలకు అత్తగారో , అమ్మ వంటి పెద్దవారో ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేయి స్తుంటారు . స్నాన సమయంలో నీళ్ళు చెవుల్లోకి , ముక్కుల్లోకి పోతే పిల్లాడికి ఇబ్బందీ , ప్రమాదం కలిగే అవకాశం ఉంది . అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు కాళ్ళ మీద పడుకోబెట్టు కొని , వేడి నీటితో సాన్నం చేయిం చాలి . స్నానానికి అరగంట ముందు పిల్లవానికి లేదా పిల్ల ఒంటికి నూనె రాసి , చిన్నగా మెత్తగా మసాజ్ చేసి మాడుకు ఆముదం పెట్టి , ఆపై నలుగుపిండితో స్నానం చేయించాలి . అలా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తే పిల్లలు ఏడ్వరు ..... నలుగు పెట్టి , నూను రాసి స్నానం చేయించటం ద్వారా పసిబిడ్డలకి వ్యాయామం అవుతుంది . తద్వారా మంచి ఆరోగ్యకరమైన శరీర పటుత్వం వస్తుంది . అందంగా , ఆరోగ్యంగా పెరుగుతారు పిల్లలు .

అసలు స్నానం ఎలా చెయ్యాలి ?

అసలు స్నానాలు ఎన్ని ? స్నానమంటే హడావుడిగా నాలుగు చెంబులు పోసుకొని వచ్చెయ్యటం కాదు . కొంత మంది శరీరం తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు . స్నానవిధి అలా చెయ్యకూడదు . అన్ని స్నానాలకన్నా సముద్ర స్నానం శ్రేష్టం . కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి . తర్వాతది నదీ స్నానం . ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి . నదీ జలాలు కొండల్లోనూ , కోనల్లోనూ , చెట్టూ పుట్టలనూ తాకుతూ ప్రవహిస్తాయి . అలా ప్రవహించటం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది . దాని వల్ల నదీ స్నానం ఎంతో ఉత్తమమైనది . ఆరోగ్యవంత మైనది . మిగిలినది ఇంటి స్నానము . అతి వేడి నీటితో గానీ , అతి చల్లటి నీటితో గానీ స్నానం చెయ్యరాదు . గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే శరీరానికి , శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది . అనారోగ్యం ఉన్నవారూ , చిన్నపిల్లలూ తగురీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి . స్నానము ఒక పని కాదు . ఓ భోగము . సంతృప్తిగా అనుభవించాలి .

పుష్కర స్నాన మహిమ

జన్నప్రభృతి యత్పాపం స్త్రీయా వా పురుషేణ వా పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి
స్త్రీ చేత గాని పురుషుని చేత గాని పుట్టినప్పటి నుండి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది .. పుష్కర సమయంలో మనమే కాదు .. ముక్కోటి దేవతలూ భూమిపై కొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు .

మసాలా దినుసులు ఎంత మంచివి ?

మిరియం రక్తాన్ని గడ్డ కట్టించదు . ఆకలిని పెంచుతుంది . లవంగము ఆస్పిరిన్లో పనిచేసి రక్తంలో గడ్డలు పడకుండా చేస్తుంది . అల్లం రక్తంలో ప్రమాద కరంగా మారే అవరోధా లను సరిచేస్తుంది . ద్రాక్ష రక్త ప్రసారాన్ని సక్రమంగా నడిపిస్తుంది . ఇక నీరుల్లి ... దీన్ని పచ్చిగా తిన్నా , ఉడికించి తిన్నా రక్తాన్ని నిరాటంకంగా ప్రవహింప చేస్తుంది .

ముక్కోటినాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ?

ఆ రోజు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటాడు . ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు . ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్య ఫలం . ఆయన నిద్ర నుంచి లేచిన రోజు తొలిగా తామే దర్శనం చేసుకొని మనసులో కోరిక కోరుకుంటే స్వామి తక్షణమే తీరుస్తాడని నమ్మకం . ముక్కోటినాడు ముక్కోటి వ్యవహారాలున్నా మానుకొని శ్రీమహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శిస్తే ముక్కోటి దేవతలూ దీవిస్తారు .

దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళ ఎందుకు కడుక్కోవాలి?

గుడికి బైలుదేరామంటే స్నానం చేసే బైలుదేర తాము . అయినా గుడి బైట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాము . దానికి కారణం స్నానం అయ్యాక , బైలుదేరేముందు చెప్పులు ధరిస్తాము . కాన ముందుగా గుడి బైట పాదరక్షలను వదలి , పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి , పంచ భూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ , ఆపాదమస్తకమూ పరిశుభ్రం చేసుకోవటానికి , తొలుత రెండు కాళ్ళు వెనక , ముందూ తడిచేలా కడుక్కుంటాము . మూడుసార్లు పుక్కిలించి నీటిని బైటికి వదలాలి . ' దేవా ! శరీరమూ , వాక్కుకి మూల కారకమైన నాలుకా , నోరూ కూడా శుభ్రపరుచుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము . కాన మమ్ము దీవించు ' అని అర్థం . అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళూ , నోరూ శుభ్రపరుచుకొని దర్శించుకోవాలి .

స్నానం ఎంత సేపు చెయ్యాలి ?

కనీసం అరగంటయినా స్నానం చేస్తే మంచిది . నాలుగు చెంబులతో శరీరాన్ని బాగా తడిపి , సున్నిపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకుని , ఆపై ఏడెనిమిది చెంబులతో శుభ్రపరుచుకోవాలి . చక్కటి మెత్తటి టవల్ లో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి . స్నానానంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవటం వల్ల అనేక రోగాలు వస్తాయి . ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి అవకాశమ ఉంది . మర్మాంగాల వద్ద సరయిన గాలి తగలకపోవటం ఉవల్ల ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి . శుభ్రంగా స్నానం చేసుకొని ఫ్యాన్ క్రింద ఓ నిమిషం నిల్చుని ఆపై దుస్తులు ధరించండి .
* స్త్రీలు వంటి మీద ఏమీ లేకుండా స్నానం చెయ్యాలి .
* మగవారు ఏదో వక గుడ్డ చుట్టుకుని స్నానం చేయాలి .
* తెల్లవారుఝామున నాలుగూ , అయిదూ మధ్య చేసే స్నానం ముని స్నానం అనగా ఋషిస్నానం .
* ఉదయం అయిదు , ఆరు మధ్య చేసేది దైవ స్నానం .
* ఆరు , ఏడుల మధ్య చేసేది మానవస్నానం . ఆపై చేసేది రాక్షస స్నానం .
* చన్నీటి స్నానం మంచిది . నదీ స్నానం ఉత్త మోత్తమం . చెరువు స్నానం మధ్యమం . నూతి స్నానం అధమం .
* పదివేల ఆదాయమొస్తున్నా మానుకొని సరయిన సమయంలో సరైన స్నానం చెయ్యటం మంచిది .

తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకుంటాయి ?

తిరుమల స్వామిని దర్శించిన వారందరికి స్వామి హస్తాలు ఉండే తీరు గమనంలోనే ఉండి ఉంటుంది .. స్వామి హస్తాలు నేలను చూపుతున్నట్టు ఉంటాయి . ఆ భంగిమకు అర్థం ... తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులకూ , దర్శించిన భక్తులకూ లేమి ఉండదని పరమార్థం . ఇదే విషయం శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది . ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు స్వామి వారిని ఆపాదమస్తకమూ తనివితీరా చూడండి . స్వామి కనిపించగానే కనులు మూసుకోకుండా ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి .

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
Course
6000Rs
(2000 Reviews)

Java Learning

Course
6000Rs
(2340 Reviews)

Python Learning

Course
6000Rs
(2000 Reviews)

.NET Learning