• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

Teachers
తాళపత్ర గ్రంథం

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
ప్రత్యక్ష శత్రువులు ఎవరు ?

పీతాచ ఋణవాన్ శత్రు ర్మాతా చ శ్యభిచారిణీ |
భార్యా రూపవతీ శత్రుః పుత్రః శత్రురుపణితః ||
అప్పులు పాలు చేసి నడి రోడ్డు మీదకు లాగిన తండ్రీ , తండ్రికి ద్రోహము చేసి గౌరవాన్ని మంట గలిపిన తల్లీ , రూపవంతురాలూ గుణవంతురాలూ కాని భార్యా , మూర్ఖుడైన మదముగల కొడుకూ వీరు ప్రధాన శత్రువులు . వీర్ని జయించుట సాధ్యం కాదు .

పంచశీల సూత్రాలంటే ఏమిటి ?

* ప్రాణాలని హింసించి , చంపి ఆనందింపరాదు .
* మనవి కాని ఏ ఆస్థులనూ , ఆనందాలనూ కోరకుండా ఉండటమూ , ప్రక్కవాడి భార్యా , పక్కవారి ధనమూ ఆశించకపోవటము ఇత్యాదులు .
* శారీరిక అధర్మ కోరికలను నియంత్రించు కోవటము ( స్వార్ధమూ , ఈర్ష్య , కుళ్ళు )
* సత్యాన్ని పలకటము ... చూడకూడనివీ ... మాట్లాడకూడనివీ ... వినకూడనివీ ... చెయ్యకుండా ఉండటము .
* దుర్వ్యసనాలకి అనగా మద్య , ధూమమూ , మగువలకు దూరంగా ఉండటము .

ఆవు ఎంత పవిత్రమైనది ?

గోవు ... గంగ ... గాయత్రి ... ఈ మూడూ పరమ పవిత్రమైనవి . ఆవుని పూజిస్తే 33 కోట్ల దేవతలని పూజించినట్లే . క్రిములు లేకుండా చెయ్యటంలోనూ , అనేక నేత్ర , హృదయ రోగాలను పారద్రోలే శక్తి గోమయంలో వుందని వైద్యశాస్త్రంలో ఉంది . ఆవుని ముట్టుకున్నంతనే ఆయుషు వృద్ధి చెందు తుంది . ఆవుకు నమస్కరిస్తే ముక్కోటి దేవతలకి నమస్కరించినట్టే

స్త్రీలు ధరించే నగల అర్థం ఏమిటి ?

వజ్రాణము : గర్భకోశము కదలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది . అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది . అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది .
ముక్కర : దీన్ని ధరించటం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలయినంత తక్కువ మాట్లాడమని చెబుతుంది . ముక్కర ధరించటం వల్ల ముక్కుకొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది . అలా దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగం . అలాగే భార్యాభర్తలు కలుసుకున్న సమయాల్లో స్త్రీ వదిలిన గాలి పురుషునికి అనారోగ్యం .. అలాంటి చెడుశ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కర పవిత్రం చేస్తుంది .
కాలికి మెట్టెలు : గర్భకోశంలో నున్న నరాలకూ కాలి వేళ్ళలో ఉన్న నరాలకు సంబంధం ఉంది . దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకోవాలంటే కాలి వేలికి రాపిడి ఉండాలి . నేలను తాకరాదు . కామాన్ని పెంచే నరాలు కుడికాలి వేళ్ళలో ఉన్నాయి .
చంద్రవంక : శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు . ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు . అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు .
కంఠానికి వేసుకునే హారాలు : హృడయంలో పర మాత్ముడున్నాడు . ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించటము . తెలిసీ తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది . బంగారం ధరించటం ద్వారా చెడు కలలు రాకపోవటమే కాదు , గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది . అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి . పూర్వం రాజులూ , చక్రవర్తులూ అతి సన్నని బంగారు రేకులు చేయించుకొని వేడి అన్నం మీద వేసేవారు . వెనువెంటనే బంగారు రేకు కరిగి అన్నంలో కలిసిపోయేది . అలా వారు బంగారాన్ని ఆహారంగా తీసుకునేవారు .

చివర్ల ఎందుకు తెంపి తాంబూలం సేవిస్తారు ?

తమలపాకు తొడిమ తింటే వ్యాధి రావటానికి అవకాశాలు ఎక్కువ . అలాగే చివర్లు తింటే పాపం . ఆకులో ఉండే ఈనెలు తింటే బుద్ధి మందగిస్తుంది . తమలపాకు నమలగానే ఊసివేయాలి . దానికి కోరణం తొడిమ , ఈనెలూ , చివర్లు ఇంకా మిగిలి ఉంటాయి . తొలి రసం ద్వారా బైటికి వదిలెయ్యటం జరుగుతుంది . తాంబూలంలో వక వక్క మాత్రమే వొడాలి . రెండు వక్కలు పనికి రావు . దండి తాంబూలాన్ని గాయాలతో ఉన్నవారూ , కంటి జబ్బులున్న వారూ , క్షయాదులున్న వారూ వేసుకో కూడదని శాస్త్రాలు చెబుతున్నాయి . ఆకుకి రాసే సున్నం మధ్య వేలూ లేదా బొటన వేలితోనే రాసుకోవాలి . దాని వల్ల ఆయుష్షు పెరుగు తుంది . ఈ రెండు వేళ్ళ ద్వారా సున్నం వ్రాయటం ద్వారా హృదయ నరాల్లో ఉత్తేజం కలిగి హృదయం తన పని తను మరింత సుళువుగా చేసుకుంటుంది .

Course
6000Rs
(2000 Reviews)

Java Learning

Course
6000Rs
(2340 Reviews)

Python Learning

Course
6000Rs
(2000 Reviews)

.NET Learning