• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

Teachers
తాళపత్ర గ్రంథం

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
రామాయణ భారత భాగవతాల్ని ఎప్పుడు చదవాలి ?

ప్రాతఃకాల సమయాన మహాభారతాన్నీ , మధ్యాహ్న మున రామాయణాన్నీ , రాత్రి సమయాన భాగవతాన్ని చదివితే ఎక్కువ ఫలం వస్తుంది .

శ్రీశైల క్షేత్ర ' సాక్షి గణపతి'ని తప్పక దర్శించాలన్నది ఎందుకు ?

శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన వారంతా పునర్జన్మ నుంచి విముక్తి కలిగించే శిఖర దర్శనం చూడటంతో పాటు సాక్షి గణపతిని దర్శించి గోత్ర , నామాలు చెప్పుకుంటారు . అలా చెప్పటంలో పరమార్ధము ... సాక్షి గణపతి కైలాసంలో పరమశివుని వద్ద శ్రీశైలాన్ని దర్శించిన భక్తుడూ , భక్తురాలి పేరు చెప్పి సాక్ష్యం ఇస్తాడు . పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులను చేస్తాడు . అందుకే సాక్షి గణపతిని తప్పక ధరించి గోత్రనామాలు చెప్పుకోవాలి .

దేవుని దీపం ఏ వైపుకి ఉండాలి ?

వెండి , పంచలోహాలు లేదా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించి భగవంతుని వైపుకి ఉంచాలి . రెండు వత్తులు ఖచ్చితంగా ఉండాలి . ఏకవత్తి వెలిగించరాదు . అలా వెలిగించటము మహా దోషము . ఓసారి పూజకు వినియోగించిన కుందిని మళ్ళీ వాడరాదు . మహాశివునికి ఎడమవైపూ , విష్ణువుకి కుడి వైపు దీపాన్ని ఉంచాలి . ఎదురుగా ఉంచరాదు . నిత్య దీపారాధన చేసే వారికి మంచి భర్త లభిస్తాడు . స్త్రీలు సుమంగుళులుగా ఉంటారు . సంతాన వంతులవుతారు . దీపారాధనంటే జగన్మాతని కూడా ఆరాధించటమే .

శ్రీమహాలక్ష్మీదేవి స్థానాలు ఏమిటి ?

గురుభక్తి , దైవభక్తి , మాతా పితృభక్తి గలవారికి లక్ష్మి తన కటాక్షాన్ని ఇస్తుంది . అతిగా నిద్రపోయే వారి గృహంలోనూ , ఉదయాన్నే పూజ చేయని వారి గృహంలోనూ లక్ష్మి నిలువదు . గృహం పరిశుభ్రంగా లేకపోయినా , గడపకు పసుపు రాయకపోయినా , స్త్రీకి నిషిద్ధమైన నాలుగు రోజులు పూజా మందిరానికి దూరంగా ఉండకపోయినా శ్రీమహాలక్ష్మి ఆ గృహం నుంచి వెళ్ళిపోతుంది . ముగ్గూ , పసుపూ , పువ్వులు , పళ్ళూ , పాలూ , దీప , ధూప , మంగళద్రవ్యాలు లక్ష్మీస్థానాలు .

స్త్రీ తన కన్నా వయసు ఎక్కువ ఉన్న పురుషుడిని ఎందుకు వివాహం చేసుకోవాలి ?

తన కన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరిక సంబంధము వల్ల పురుషునికి శక్తి తగ్గిపోతుండ అసత్యం . స్త్రీకి సిగ్గూ , బిడియమూ ఎక్కువ . కాన ప్రేమతో లాలించి , బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదవ్వాలి . సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు . కాన సంసారాన్ని మోయలేదు . కష్టించలేదు . ఆ పైగా స్త్రీ పెద్దదయితే కుటుంబ భారం స్త్రీ మీద పడుతుంది . మగవాడిదే కుటుంబ భారమని చెప్పటమే పరమార్థం . అందువల్లే భార్యకంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది నియమముగా పెట్టారు పెద్దలు .

Course
6000Rs
(2000 Reviews)

Java Learning

Course
6000Rs
(2340 Reviews)

Python Learning

Course
6000Rs
(2000 Reviews)

.NET Learning