• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

Teachers
తాళపత్ర గ్రంథం

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
పిడుగులు పడేటప్పుడు ' అర్జునా , ఫాల్గుణా ' అని ఎందుకు పెద్దలు అనమంటారు ?

వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మము . ఆ సమయంలో చెట్టు క్రింద ఉండ కూడదు . అలాగే అర్జునా , ఫాల్గుణా అనమనటంలో ఓ గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది . మహాభారత గాథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం వద్దకు తెస్తాడు . ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించుకుపోతున్న దుర్యోధన , కర్ణాదులను ఎదుర్కోవ టానికి ఆయుధాలను శమీవృక్షం మీద నుంచి క్రిందకు తెమ్మంటాడు . అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే , తనకున్న పది పేర్లను చెప్పి ఉత్తర కుమారుడి భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు . అర్జునుడి పది నామధేయాలు ... అర్జునా , ఫాల్గుణా , పార్థ , కిరీటి , శ్వేతవాహన , భీభత్స , విజయ , కృష్ణ ( పాండవులు పెట్టిన పేరు ) , సవ్యసాచీ , ధనుంజయ . కాన అర్జునుడి పది పేర్లలో పిడుగులు పడ్డప్పుడు ఏ పేరు తలచినా , భయం తీరుతుంది . కొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడి రథ చక్ర సూల విరిగిందని అదే పిడుగని చెబుతారు . అలా చెప్పటంలో కూడా అర్జునుడిని తలచి విన్పించటమే .

శ్రీశైలంలో ఇచ్చే యాగభస్మములో ఎన్ని వనమూలికలుంటాయో తెలుసా ?

రావీ , మోదుగా , మేడి , ఉత్తరేణూ , జమ్మీ , జిల్లేడూ , చండ్రా , దేవదారూ , దర్భ , జువ్వి లాంటి వాటితో యాగము నిర్వహించి యాగానంతరము లభించేదే యాగభస్మము . ఈ భస్మము పవిత్రమైనదీ , పుణ్యప్రదమయినదీ కూడా . ఆ భస్మాన్నే దేవస్థానము వారు ఇస్తారు .

తుమ్ముగానే చిరంజీవ అని పెద్దలంటారెందుకు ?

మన శరీరం ఎన్నో రుగ్మతలను కలిగి ఉంటుంది . అనారోగ్యం గూర్చి తుమ్ము మనకు అనేక సంకేతాలను పంపుతుంది . మరి ముఖ్యంగా పిల్లలు తుమ్ముతుంటే పెద్దలు చిరంజీవ అని అంటారు . అనగా బహుకాలం జీవించ మని . తుమ్ము అనారోగ్య చిహ్నము . మన తాత ముత్తా తలు పిల్లల తుమ్మును బాగా పట్టించుకునేవారు . ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారు . తుమ్ము వచ్చిందంటే శరీరంలో అనారోగ్యము ఉన్నట్లు

బ్రాహ్మణులను భూలోక దేవతలంటారు నిజమేనా ?

అవును . వైదిక వృత్తిలోనున్న వారూ , ధర్మ , అర్థ , కామ , మోక్షాలను ఆయా కాలాల్లో నిర్వహించేవారూ , మంత్రాలతో పదిమందికీ శుభం కలిగించే వారూ అయిన బ్రాహ్మణులు మాత్రమే భూలోక దేవతలుగా అర్హూలు . అలాగే వేదమంత్రాలను ధనానికి కాకుండా పరులకూ , లోక కళ్యాణం కొరకూ ఉపయోగించేవారూ , ఆడంబరాలకు దూరంగా ఉండేవారూ , అసత్యమాడని వారూ , పరనిందలు వేయనివారూ , శాస్త్రాల సారాన్ని తెలుసుకున్నవారూ భూలోక దేవతా దూతలే .

గడపని తొక్కటం , కూర్చోవటం చెయ్యకూడదని , అలాగే గడపకి పసుపు రాయటంలో ఆంతర్యము ఏమిటి ?

అసుర సంధ్య వేళ శ్రీమహావిష్ణువు నరశింహా వతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్య కశిపుడిని సంహరించాడు . అట్టి గడప శ్రీమహావిష్ణువు స్థానం . దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తుంటాయి . గడప అంటే లక్ష్మీదేవి కూడా . అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు . మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు . పూర్వకాలంలో పాములెక్కువ తిరుగుతుండేవి . రక్షణగా కూడా పసుపును గుమ్మాలకూ , గడపకూ పట్టించేవారు . దాని ఘాటుకు పాములు ఇత్యాది విషక్రిములు లోపలికి రాలేవు .

Course
6000Rs
(2000 Reviews)

Java Learning

Course
6000Rs
(2340 Reviews)

Python Learning

Course
6000Rs
(2000 Reviews)

.NET Learning