• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

Teachers
తాళపత్ర గ్రంథం

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
తమలపాకంటే సకల దేవతల స్థానమా ?

అవును . అందుకే ప్రతి శుభకార్యానికి తమల పాకును తప్పని సరిగా వాడతారు . నాగవల్లి దళమనే తమలపాకు దేవతాదళము . తమలపాకు తొడిమలో లక్ష్మీదేవి , మధ్య భాగాన పరమేశ్వరుని సతి పార్వతీ దేవి ... కొన భాగంలో విద్యాలక్ష్మి అయిన సరస్వతీ దేవి ఉంటారు . ఇంద్రుడూ , మన్మథుడూ , విష్ణువు , శివుడూ , బ్రహ్మ తమల పాకుపై సదా కొలువు తీరి ఉంటారు . తమల పాకు ఉపవాస వేళల యందు తీసుకో రాదు . అలాగే ఎండిన లేదా చినిగిన తమల పాకులు శుభకార్యాల్లో వాడరాదు .

గాయత్రీ మంత్రం అర్థం ... ?

అన్నీ మంత్రాలలో కన్నా శ్రేష్టమైనది గాయత్రీ మంత్రం . గానం చేసే వార్ని రక్షించేది . భూలోకమూ , భువర్లోకమూ , సువర్లోకమూ బ్రహ్మ స్వరూపమని తెలియ చెబుతోంది . “ ఓం భూర్భువః స్వ తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్ . " అన్నదే గాయత్రీ మంత్రం .

ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు ?

మన భూమిలో అయస్కాంత శక్తి ఉత్తర దక్షిణలుగా ఇమిడి ఉంటుంది . మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మన మెదడులోని శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి . వల్ల అనేక ఆరోగ్య , మానసిక సమస్యలు , రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పు వస్తుంది . మెదడులో లోపాలు తల ఎత్తుతాయి . అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిదురిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉండి మెరుగు పడుతుంది . రక్త ప్రసరణ సరిగా జరిగి శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది .

అప్పు తీసుకోవటానికి ధర్మరాజే వెనకడుగు వేశాడా ?

ధర్మరాజు ధర్మం తప్పనివాడు . ఏ ధర్మ సూక్ష్మాని కైనా , ధర్మజుడినే అడుగుతారు . ఆ కాలంలో ఓ సారి ధర్మరాజు కుబేరుని వద్ద ధనాన్ని అప్పుగా తీసుకోవటా నికి వెళ్ళాడు . అప్పుడు ధర్మరాజు యొక్క ధర్మ గుణాన్ని పరీక్షించ దలచి ... ధర్మరాజా ఋణము తీసుకున్నప్పుడు ఆనందించినంతగా , తిరిగి ఇచ్చేటప్పుడు ఆనందిస్తూ ఇవ్వగలవా ? అని అంటే ధర్మరాజు మారుమాట్లాడ కుండా వెనక్కి వచ్చేశాడు .

రాహుకేతువులకి అప్రదక్షిణము చేయాలా ?

గ్రహాలకి రాజు సూర్యుడు అన్ని గ్రహాల మధ్యన ఉంటాడు . చంద్రుడు ఆగ్నేయంగా ఉంటాడు . అంగారకుడు దక్షిణంగానూ , బుధుడు సూర్యునకు ఈశాన్యంగానూ , బృహస్పతి ఉత్తర దిక్కుగానూ ఉన్నారు . తూర్పున శుక్రుడుంటాడు . పశ్చిమ దిక్కున శనైశ్చరుడూ , నైఋతిలో రాహువూ , వాయువ్యంలో కేతువూ ఉంటారు . అయితే గ్రహాలన్నీ ఒకే విధంగా ఉంటే రాహు కేతువులు వేరుగా అప్రదక్షిణంగా తిరుగుతున్నట్టు ఉంటాయి . అయినా మనం ఆయా గ్రహాల పూజల ప్రకారమే చేయాలి .

Course
6000Rs
(2000 Reviews)

Java Learning

Course
6000Rs
(2340 Reviews)

Python Learning

Course
6000Rs
(2000 Reviews)

.NET Learning