• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

Teachers
తాళపత్ర గ్రంథం

Java Training in Andhra Pradesh and Telangna

Java Training in Andhra Pradesh and Telangna
బట్టలుతికిన నీళ్ళు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా ?

అవుననే చెప్పాలి . మురికి పట్టిన బట్టల నీటిని అనాలోచితంగా కాళ్ళ మీద పోసుకుంటారు ఆడవాళ్ళు కొందరు . అలా చేయటం వల్ల పుట్టింటికి అరిష్టము . ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ సమాయన్ని నీటిలో ఉంటూ పని చేయటం ద్వారా కాళ్ళకూ , చేతులకూ పగుళ్లోస్తాయి . వందలో తొంభై మధ్య తరగతి వారూ క్రింద తరగతి స్త్రీలలో ఖచ్చితంగా కాళ్ళలో పగుళ్ళు ఆ ఏర్పడతాయి . వారిలో పదిశాతం చదువుకున్న , లేదా అందం పట్ల , ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు . అలా జాగ్రత్తలు తీసుకోని మహిళలు గుడ్డలుతికిన నీటిని , మలినమైనవీ , క్రిములున్న నీటిని కాళ్ళపై పోసుకోవటం ద్వారా అనేక క్రిములు శరీరంలోకి ప్రవేశించి , అనారోగ్యాన్ని కలగ చేస్తాయి . అప్పుడు అడ్డం పడితే భర్త పుట్టింటికి పంపిస్తాడు . ఆపై పడేదే పుట్టింటి వాళ్ళేగా బాధలు . కూతురు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని తల్లీ , తండ్రీ కోరు కుంటారు . అలా కాళ్ళ మీద గుడ్డలుతికిన నీరు పోసుకుంటే పుట్టింటికి అరిష్టమని చెప్త , ఆడపిల్ల పుట్టింటి మీద ప్రేమతో చెయ్యకుండా ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు అలా చెబుతారు .

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లెందుకు కట్టుకోకూడదు ?

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నూతన గృహ ప్రవేశం పెట్టుకోకూడదు . నిర్మించకూడదు . జీవితాంతము ఉండే ఇంటి పట్ల , వంశాన్ని ఉద్ధరించే సంతానము పట్ల ఎంతో శ్రద్ధ అవసరం . గర్భవతిగా ఉన్న భార్యని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి . అత్యంత ముఖ్యమైన రెండు విషయాలని ఎవ్వరూ వకేసారి సరయిన రీతిలో చూసుకోలేరు . రెంటికీ న్యాయం చెయ్యలేరు . కాన గృహ నిర్మాణం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కూడదు .

వీటినెన్నటికీ చెప్పరాదు ?

నేర్చుకున్న రహస్య మంత్ర ఔషధములూ , ధర్మమూ ( చేసి చూపించాలి ) , ఇంటిలో పోరూ , కోరి వచ్చిన లేదా కోరుకున్న స్త్రీతో కలయికా , భార్యతో గడిపిన విషయాలూ , చెడువార్త ... ఇట్టి వీటిని ఇతరులతో చెప్పరాదు .

పిల్లల్ని ఎలా పెంచాలి ?

అయిదు సంవత్సరాలు వచ్చే వరకూ పిల్లలని రాజకుమారుల్లా అతి గారాబంగా పెంచాలి . ఆపై పదిహేను సంవత్సరాల వరకూ సేవకుడిలా ఆజ్ఞాపించి పెంచాలి . పదహారు సంవత్సరాల తర్వాత మిత్రునిలా భావించి పెంచాలి . అప్పుడే ప్రయోజకులవుతారు . పిల్లల్ని ప్రేమతో చూడటం వేరు గారాబాంగా చూడటం వేరు . ప్రేమతో పెంచితే ప్రయోజకులవు తారు . గారాబంగా పెంచితే మీకూ దేశానికీ , కట్టుకున్న దానికి సమస్య అవుతారు . చిన్నతనంలో మన తల్లీ , తండ్రీ నుంచి మనం ఏం కోల్పోయామో , ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికొచ్చామో గమనించి ఆవే తప్పులు మళ్ళీ చేసి ఆపై చింతించకండి . పిల్లలు పెరిగి పెద్దయి ప్రయోజకులుగా మారి , మనల్ని ఉద్ధరించే స్థితిలో ఉండాలి . కాని మనమే వారిని చూసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లలని సరైన దారిలో పెంచ లేదని ....

ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి ... ఆ పనులేంటి ?

వంద పనులున్నా ... కోటి ధనం వస్తుందన్నా సమయానికి భోజనం చేయాలి . వెయ్యి పనులున్నా తగు సమయాన్ని వెచ్చించి స్నానము చేసి పూజాధికాలు చేయాలి . లక్ష సమస్యలున్నా దానము చేయాలనిపిస్తే వాయిదా వేసుకోకుండా చేసేయాలి . కోటి పనులున్నా వదలి శ్రీహరిని సమయానికి పూజించాలి . ఇవి చేయ గలిగితే మీకన్నా సుఖవంతుడు ఉండరు .

Course
6000Rs
(2000 Reviews)

Java Learning

Course
6000Rs
(2340 Reviews)

Python Learning

Course
6000Rs
(2000 Reviews)

.NET Learning